ఈడీ చర్యలకు మేం భయపడం !

Telugu Lo Computer
0


నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు బీజేపీ బెదిరింపు వ్యూహమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని ఈడీ సీజ్ చేసింది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాన్ని తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు గురువారం చర్చించేందుకు సమావేశమవుతోన్న సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈడీని ఉపయోగించుకుని కేంద్రం విపక్షాల గొంతుకలను నొక్కాలని ప్లాన్ చేస్తోందన్నారు. విపక్షాలపై ఒత్తిడి పెంచితే భయపడతామని ప్రధాని నరేంద్ర మోడీ, అమిషా భావిస్తున్నారు. కానీ మేం భయపడం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ ఏం చేసినా ఎదుర్కొంటాం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కృషి చేస్తూనే ఉంటాం.' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా, మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. విచారణలో 100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)