సముద్రపు అడుగున వింత జీవి సీ కుకుంబర్ ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 August 2022

సముద్రపు అడుగున వింత జీవి సీ కుకుంబర్ ?


సముద్రంలో అనేక విలువైన జీవ సంపద దాగి ఉంది. జీవులే కాదు.. ఖనిజ సంపద కూడా దాగి ఉంది. అందుకే శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణలు కొనసాగిస్తున్నారు. అయితే, మనకు తెలిసినంత వరకు సముద్రంలో అనేక జీవులు ఉన్నాయి. వాటిలో 'సీ కుకుంబర్' ఒకటి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఆహారం సేకరించే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవి ఆహారం సేకరించే దశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాగా ఆకలితో ఉన్న సీ కుకుంబర్.. ఆహారం తినడంకోసం తన టెన్టకిల్ లాంటి నిర్మాణాలను ఓపెన్ చేసింది. వాటి సాయంతో ఆ కుకుంబర్ తన ఆహారాన్ని తినేస్తుంది. నోటి చుట్టు చేతుల మాదిరిగా ఉన్న శరీర భాగాలతో నీటి అడుగున ఉన్న ఆకులను, పాచిని, ఇతర పదార్థాలను తీసుకుని తినేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 10 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే తినే విధానం చూసి షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 16 వేల వ్యూస్ రాగా, అంతే స్థాయిలో లైక్స్ కూడా వస్తున్నాయి. అయితే, ఈ కుకుంబర్ తినే విధానాన్ని కొందరు నెటిజన్లు తాము తినే విధానంతోనూ పోల్చుకుంటున్నారు. తాము కూడా ఇలా తింటామంటూ ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. మరికొందరు తమ పిల్లలతో పోల్చుకుంటున్నారు.

No comments:

Post a Comment