కరోనాపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం !

Telugu Lo Computer
0


దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటుతోంది.  వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు రెట్టింపు అవుతోంది. వీకెంట్ సమయంలో కేసుల పెరుగదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖలు రాశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పక్క వ్యూహాంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అర్హులైన ప్రజలందరికీ టీకా అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. రాబోయే పండగ రోజుల్లో సామూహిక కార్యక్రమాలు జరుగుతాయని..వీటి వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని..అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)