కానిస్టేబుల్‌పై యువకులు దాడి !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీ ఆనంద్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆగస్టు 3వ తేదీన సుమారు పది, పన్నెండు మంది చుట్టూ చేరి ఓ కానిస్టేబుల్‌ను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల చాలా మంది ఆ ఘటనను వీడియో, ఫొటోలు తీశారు కానీ, ఎవరూ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితుడు ఆ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా తెలుస్తోంది. క్షమించి వదిలేయాలని ఆ కానిస్టేబుల్‌ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు. ఆ కానిస్టేబుల్ ఏం తప్పు చేశాడు? ఎందుకు అతడిని చితకబాదారు? అనే కారణాలేమీ తెలియవు కానీ, పోలీసులపై దాడి చేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దాడి చేసిన వాళ్లను గుర్తించి, వారిన కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దాంతో స్పందించిన ఢిల్లీ పోలీసు విభాగం.. వీడియోలో ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)