శ్రీజ వాట్సాప్ స్క్రీన్ షాట్ వైరల్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 July 2022

శ్రీజ వాట్సాప్ స్క్రీన్ షాట్ వైరల్ !


చిరంజీవి మూడవ కూతురు శ్రీజా ఇటీవల సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికి తెలిసిందే. కళ్యాణ్ దేవ్ తో   శ్రీజ విడాకులు తీసుకున్నట్లు వచ్చిన వార్తలతో శ్రీజ తరుచూ సోషల్ మీడియా లో ఒక టాపిక్ గా మారిపోయింది..అంతే కాకుండా త్వరలో తన చిన్ననాటి స్నేహితుడితో శ్రీజ మూడవ వివాహం చేసుకొంటుంది అంటూ వస్తున్నా వార్తలు కూడా సోషల్ మీడియా లో పెను దుమారమే రేపుతోంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ, తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకున్న విషయం మాత్రం వాస్తవమే అంటూ ఫిలిం నగర్ భోగట్టా. ఈ జంట ఇద్దరు హై కోర్టు లో తమ విడాకులకు సంబంధించి పిటిషన్ వేశారని, విడాకులు వచ్చిన వెంటనే ఈ ఇద్దరు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేస్తారు అని తెలుస్తుంది. శ్రీజా ఎప్పుడూ కూడా సోషల్ మీడియా లో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండే సంగతి మన అందరికి తెలిసిందే..తన వ్యక్తిగత విషయాలు మరియు తనకి సంబంధించిన ఫోటోలు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే గత కొన్ని నెలల నుండి సోషల్ మీడియా లో తన గురించి ప్రచారం అవుతున్న ఒక్క రూమర్ మీద కూడా ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్పట్లో 'శ్రీజ కళ్యాణ్' అని ప్రొఫైల్ నేమ్ పెట్టుకుంది. కానీ ఈమధ్య కాలం లోనే ఆమె తన పేరు ని శ్రీజా కళ్యాణ్ నుండి 'శ్రీజ కొణిదెల' కి మార్చుకుంది. దీనిని బట్టి తనకి విడాకులు జరిగిన విషయం పరోక్షంగానే అభిమానులకు చెప్పింది శ్రీజా. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ ఆమె పెట్టిన తన వ్యక్తిగత వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తన అమ్మగారు సురేఖతో శ్రీజా చేసిన వాట్సాప్ చాట్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ గా పెట్టుకుంది.  శ్రీజాతో సురేఖ ఇంత సరదాగా ఉంటుందా అని అనిపిస్తుంది ఈ స్క్రీన్ షాట్ లో మెస్సేజులు చూస్తుంటే. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ ని మెగా అభిమానులు సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తున్నారు.

No comments:

Post a Comment