ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం !

Telugu Lo Computer
0


జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ మీడియా కంగూరు కోర్టులను నడిపిస్తోందని ఆరోపించారు. కొన్ని కేసుల్లో అనుభవజ్ఞులైన జడ్జీలు కూడా ఇవ్వలేని తీర్పులను మీడియా ఇస్తోందని ఆయన అన్నారు. అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని రమణ ఆరోపించారు. అతి దూకుడు, బాధ్యతారాహిత్యం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నట్టు మీడియాపై ఆయన సీరియస్ అయ్యారు. ప్రింట్ మీడియా ఇంకా కాస్త జవాబుదారీగా వ్యవహరిస్తోందని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జవాబుదారీతనంతో ఉందని పేర్కొన్నారు. ఇటివల కాలంలో న్యాయమూర్తులపై దాడులు పెరుగుతున్నాయని, ఎలాంటి రక్షణ లేకుండానే జడ్జిలు సమాజంలో జీవించాల్సి వస్తోందన్నారు. రాజకీయవేత్తలు, అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులకు రిటైర్మెంట్ తర్వాత కూడా సెక్యూర్టీ కల్పిస్తున్నారని , కానీ జడ్జీలకు మాత్రం ఈ తరహా రక్షణ లేకుండా పోయిందన్నారు. నిర్ణయాత్మక కేసుల్లో మీడియా విచారణ సరైంది కాదన్నారు. బేధాభిప్రాయాలను ప్రచారం చేస్తున్న మీడియా. ప్రజల్లో వైరుధ్యాన్ని పెంచుతోందన్నారు. సోషల్ మీడియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని సీజే వ్యాఖ్యానించారు. స్వీయ నియంత్రణతో మీడియా ఉండాలని ఆయన కోరారు. ప్రజలను విద్యావంతులను చేసేందుకు , చైతన్య పరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తన గళాన్ని వాడుకోవాలని సీజే రమణ సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)