26న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Telugu Lo Computer
0

 


నేషనల్‌ హెరాల్డ్‌  కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని ఈడీ ఈనెల 26న మరోసారి విచారించనుంది. అదే రోజున దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్షలు నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నారు. సోనియా గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈడీ  విచారణ పేరుతో సోనియా గాంధీ, ఆమె కుటుంబాన్ని మానసిక వేధింపులకు గురిచేయడం ద్వారా రాజకీయాలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)