ఎన్‌డిఎ అంటే నో డేటా ఎవైలబుల్ !

Telugu Lo Computer
0


వివిధ సందర్భాల్లో తమ వద్ద తగిన డేటా లేదంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ఈ ప్రభుత్వం వద్ద డేటానే కాదు, జవాబుదారీతనం కూడా లేదని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్డీయే అనే పదానికి తనదైన నిర్వచనం ఇచ్చారు. ఎన్డీయే అంటే నో డేటా ఎవైలబుల్ అని ఎద్దేవా చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోవడం కానీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఎవరూ చనిపోవడం గానీ జరగలేదన్న విషయం ప్రజలు నమ్మాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందని రాహుల్ గాంధీ అన్నారు. మూకుమ్మడిదాడులు, జర్నలిస్టుల అరెస్టుల వంటి వాటిపైనా ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రభుత్వం వద్ద డేటా లేదు. సమాధానం లేదు. జవాబుదారీ తనం అసలే లేదని ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)