ప్రియుడి కోసం దారుణానికి ఒడిగట్టిన యువతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 July 2022

ప్రియుడి కోసం దారుణానికి ఒడిగట్టిన యువతి


ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈనెల 2న తల్లీకూతుళ్లు సజీవన దహనమయ్యారు. తొలుత ఇది అగ్నిప్రమాదంగా భావించినా పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్న కొద్దీ ఒక్కొక్కరి ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది. కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన మేడిశెట్టి సురేష్ కు అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్న సురేష్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నాగలక్ష్మిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె.. సురేష్ ను తన భార్య నుంచి విడదీసి తనవైపు తిప్పుకోవాలని భావించింది. ఇందుకోసం ఎన్నో పన్నాగాలు పన్నింది. జ్యోతికి అక్రమ సంబంధం ఉందంటూ సురేష్ ఇంటివద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు ఆమె సవతి కూతుళ్లు సహకరించేవారు. ఆ ఉత్తరాలు చవిదిన సురేష్.. అవేవీ నమ్మకుండా భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఇక ఎంత ప్రయత్నించినా సురేష్.. భార్యను వదిలి రాకపోయేసరికి నాగలక్ష్మి మరోస్కెచ్ వేసింది. జ్యోతిని చంపేస్తే ప్రియుడు మళ్లీ తన దగ్గరకి వస్తాడని భావించింది. ఈ క్రమంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. ఈనెల 2న రాత్రి తన తల్లితో కలిసి నిద్రిస్తుండగా.. అక్కడికెళ్లిన నాగలక్ష్మి.. తన సవతి కూతుళ్లయిన సౌజన్య, దివ్య, హరితలను తీసుకెళ్లి.. జ్యోతి, ఆమె తల్లిపై పెట్రోల్ పోయాలని చెప్పింది. వారు ఆమె చెప్పినట్లే చేయగా.. వెంటనే ఇంటికి నిప్పంటించింది. ఇంట్లో మంటలు చెలరేగడంతో జ్యోతి తండ్రి నిద్రలేచి మంటలార్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే తల్లీకూతుళ్లిద్దరూ సజీవ దహనమయ్యారు. తొలుత ఇది ప్రమాదమని భావించినా.. హత్య కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నాగలక్ష్మితో పాటు ఆమెకు సహకరించిన హరిత, దివ్య, సౌజన్యలను అదుపులోకి తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెళ్లికి ముందు భర్త నడిపిన వ్యవహారానికి అన్యాయంగా భార్యతో పాటు ఆమె తల్లికూడా బలైపోయిందంటూ బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

No comments:

Post a Comment