చంద్రబాబు చేతి వేలికి మైక్రోచిప్ ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 July 2022

చంద్రబాబు చేతి వేలికి మైక్రోచిప్ ?


తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎప్పుడూ లేనిది చేతికి ఉంగరాలు పెట్టుకొని సమావేశంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రధారణతో ఎంతో సింపుల్‌గా కనిపించే ఆయన.. ఎలాంటి ఆభరణాలు కానీ.. ఉంగరాలు కానీ ధరించడానికి ఇష్టపడరు. కానీ, సడన్‌గా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో చేతి వేళ్లకు ఉంగరాలు ధరించి కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుండగా.. తాజాగా.. స్వయంగా చంద్రబాబే ఉంగరం ధరించడంపై స్పందించారు. గురువారం పాల్గొన్న ఓ సమావేశంలో హైటెక్ రింగుపై పార్టీ కేడర్‌కు వివరించారు. ఇది ఆడంబరాలకు పెట్టుకున్న ఉంగరం కాదని క్లారిటీ ఇచ్చారు. ఆ హైటెక్ రింగ్‌లో మైక్రోచిప్ అమర్చినట్లు తెలిపారు. దీంతో ఆ ఉంగరం తన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తుందని వివరించారు. నిత్యం తన ఆరోగ్య పరిస్థితిని కంప్యూటర్‌కు పంపిస్తుందని వెల్లడించారు. దానిని బట్టి వైద్యులు తనకు సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు.

No comments:

Post a Comment