కదలలేని స్థితిలో కైకాల సత్యనారాయణ

Telugu Lo Computer
0


సీనియర్‌ నటుడు కైకాల బర్త్‌డే నేడు. సోమవారం 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయన జన్మదిన వేడుకను నిర్వహించారు. ఇందుకోసం స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్‌ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌ చేస్తూ 'పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను' అంటూ రాసుకొచ్చారు. కాగా కైకాల ప్రస్తుతం వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఆయన కనీసం నిలబడి లేని, కదలలేని స్థితిలో ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)