బెంగళూరులో మరో ఉగ్రవాది అరెస్టు

Telugu Lo Computer
0

బెంగళూరు నగరంలోని తిలక్ నగర్ లో అక్తర్ హుస్సేన్ లష్కర్ అలియాస్ అక్తర్ అలియాస్ హుస్సేన్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అక్తర్ హుస్సేన్ లష్కర్ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం అందండంతో సోమవారం వేకువ జామున బెంగళూరు సీసీబీ పోలీసులు అతని ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేశారు. అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే అనుమానిత ఉగ్రవాది బెంగళూరులోని తిలక్ నగర్ లో మకాం వేసి కొందరు యువకులకు బ్రేన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. ఫేస్ బుక్, టెలిగ్రామ్, మెసేంజర్ తో పాటు పలు సోషల్ మీడియా ద్వారా అకౌంట్ ల ద్వారా అమాయకులైన యువకులు అక్తర్ టార్గెట్ చేసుకున్నాడని పోలీసులు అన్నారు. అద్దె ఇంటిలో అక్తర్ పాటు నివాసం ఉంటున్న మరో యువకుడిని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అక్తర్ హుస్సేన్ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న అతని స్నేహితుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అక్తర్ హుస్సేన్ రూమ్ లో ఉన్న మరో యువకుడి పేరు కూడా అక్తర్ అని పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసులు అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో అక్తర్ హుస్సేన్ కు సంబంధాలు ఉన్నాయని, అతన్ని విచారణ చెయ్యడానికి కస్టడీకి ఇవ్వాలని సీసీబీ పోలీసులు కోర్టుకు మనవి చేశారు. అక్తర్ హుస్సేన్ ను 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యడానికి కోర్టు బెంగళూరు సీసీబీ పోలీసులకు అనుమతి ఇచ్చిందని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)