గొటబాయ ప్యాలెస్‌లో హై సెక్యూరిటీ బంకర్ !

Telugu Lo Computer
0


శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, పరిస్థితి నానాటికీ మరింత దిగజారుతుండడం, అధ్యక్షుడు రాజీనామాకు నిరాకరించడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలాదిమంది ఆందోళనకారులు శనివారం అధ్యక్ష భవనాన్నిచుట్టుముట్టారు. భవనం గేట్లను లాగిపడేసిన ఆందోళనకారులు భవనంలోకి చొరబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విలాసవంతమైన ఆయన నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు కబోర్డులా ఉన్న ఓ తలుపు తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. ఆ తలుపు వెనక ఉన్న దారిలో వెళ్లి చూస్తే విలాసవంతమైన హై సెక్యూరిటీ బంకర్ కనిపించింది. కొందరు ప్యాలెస్‌ ఆసాంతం క్షుణ్ణంగా పరిశీలించగా, మరికొందరు మంచాలపై కనిపించారు. ఇంకొందరు ప్యాలెస్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి ఈత కొట్టారు. మరికొందరు ఆయన గదిలో విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు చిక్కారు. మరోవైపు, ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడానికి ముందే పరారైన రాజపక్ష ఎక్కడున్నారన్న విషయం ఇప్పటికీ తెలియరాలేదు. పార్లమెంటు స్పీకర్ మహింద యప అబేవర్ధనతో మాత్రం కాంటాక్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే  ప్రైవేటు నివాసానికి ఆందోళనకారులు  నిప్పుపెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)