వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని పుణేలో ఓ వాగుకు భారీగా వరద నీరు చేరగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. వెంటనే ఇద్దరు పోలీసులు ఆ వరద ప్రవాహంలోకి దూకి నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించారు. మొదట ఒకరే ఆ వరద నీటిలో దిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయగా, వరద ఉధృతికి అది సాధ్యపడలేదు. అతన్ని కాపాడే ప్రయత్నంలో పోలీస్ అధికారి కూడా నీళ్లలో పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో పోలీస్ అధికారి వెంటనే వరద నీటిలోకి దిగి వాళ్లను చేరుకున్నాడు. ఎట్టకేలకు ఇద్దరు పోలీసులు కలిసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. పుణేలోని బగుల్ ఉద్యాన్ సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని దత్తవాడి పోలీస్ స్టేషన్‌కి చెందిన సద్దాం షేక్, అజిత్ పోకరే అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కాపాడారు. ప్రాణాలకు తెగించి మరీ ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని రక్షించడం నిజంగా ప్రశంసనీయం.

Post a Comment

0Comments

Post a Comment (0)