కేంద్ర ప్రభుత్వ సాయిల్ హెల్త్ కార్డు పథకం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 July 2022

కేంద్ర ప్రభుత్వ సాయిల్ హెల్త్ కార్డు పథకం !


సాయిల్ హెల్త్ కార్డ్ పథకం కింద 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు తమ పంచాయతీలో చిన్న భూసార పరీక్షా ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తికి ప్రభుత్వం 75 శాతం చెల్లిస్తుంది. దీని సహాయంతో గ్రామంలో నివసించే ప్రజలు దాని నుండి ప్రయోజనం పొందవచ్చు. కరోనా మహమ్మారి తర్వాత నగరాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో.. తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చిన ప్రజలు అక్కడ ఏదో ఒక ఉపాధి అవకాశాలను వెతుకుతున్నారు. వ్యవసాయం కాకుండా పల్లెల్లో ఉండి సంపాదించుకోవాలనుకునే వారికి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. అదే సాయిల్ హెల్త్ పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక గ్రామంలో వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, సాయిల్ హెల్త్ కార్డ్ పథకం మీకు ఉపయోగపడుతుంది. సాయిల్ హెల్త్ కార్డు పథకం కింద.. పంచాయతీ స్థాయిలో చిన్న భూసార పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ ప్రయోగశాలలో సమీపంలోని పొలాల మట్టిని పరీక్షిస్తారు. ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగశాలలు చాలా తక్కువ. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కింద 18 నుంచి 40 ఏళ్లలోపు వారు తమ పంచాయతీలో చిన్న భూసార పరీక్షా ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అగ్రికల్చర్ క్లినిక్, అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్ ట్రైనింగ్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు. రైతు కుటుంబానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. మినీ సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేయడానికి, మీరు మీ జిల్లాలోని డిప్యూటీ డైరెక్టర్ (వ్యవసాయం) లేదా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్‌ని వారి కార్యాలయంలో సంప్రదించాలి. ఇది కాకుండా ల్యాబ్‌లను పరీక్షించడం ప్రారంభించడానికి agricoop.nic.in అండ్ soilhealth.dac.gov.in వెబ్‌సైట్‌లను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం కాల్ సెంటర్ (1800-180-1551)ని సంప్రదించవచ్చు. మీ జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయిస్తే సాయిల్ హెల్త్ కార్డు పథకం కింద మినీ టెస్టింగ్ లేబొరేటరీ ఏర్పాటు చేసేందుకు ఫారం అందజేస్తారు. మీరు ఫారమ్‌ను నింపి.. అవసరమైన అన్ని పత్రాలను జతచేసి వ్యవసాయ శాఖకు సమర్పించాలి. పంచాయతీలో ఏదైనా చిన్న భూసార పరీక్ష ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ సాయిల్ హెల్త్ కార్డ్ పథకం కింద ల్యాబ్ ఇన్‌స్టాలర్‌కు ప్రభుత్వం 75 శాతం చెల్లిస్తుంది. మీ పంచాయతీలో ల్యాబ్ ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం 3.75 లక్షల రూపాయలు ఇస్తుంది. అందుకు రూ.1.25 లక్షలు వెచ్చించాలి. గ్రామ స్థాయిలో భూసార పరీక్ష ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడానికి దరఖాస్తుదారు సొంతంగా లేదా అద్దెకు తీసుకున్న ఓ రూం కావాల్సి ఉంటుంది. గ్రామీణ యువత కోరుకుంటే మొబైల్ సాయిల్ టెస్టింగ్ వ్యాన్ రూపంలో ప్రయోగశాల కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. రైతుల పొలాల్లో మట్టి నమూనాలు తీసుకుని పరీక్షించాలి. ఒక్కో పరీక్ష నమూనాకు రూ.300 పొందుతారు. ఈ విధంగా మీరు నెలలో 15-25 వేల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. భూసార పరీక్ష ల్యాబొరేటరీ ద్వారా రైతులు తమ పొలాల్లోని నేలలోని పోషకాల గురించి సమాచారాన్ని పొందుతారు. దీంతో పాటు ఎరువుల కొరత.. తమ పొలాల్లో యూరియాను ఎంతమేర వాడాలి అనే విషయాలను తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment