జబర్దస్త్ లో నాగబాబు కంటే రోజాకు ఎక్కువ పారితోషికం ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 July 2022

జబర్దస్త్ లో నాగబాబు కంటే రోజాకు ఎక్కువ పారితోషికం ?


బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంది. 2013లో ధనరాజ్, వేణు వంటి కమెడియన్లతో రోజా, నాగబాబు జడ్జీలుగా, అనసూయను యాంకర్ గా ఈ కార్యక్రమం మొదలైంది. నిర్విరామంగా 9 సంవత్సరాల పాటు మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన ఈ వేదిక ఎంతోమందికి మంచి జీవితాన్ని అందించింది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బందుల పడుతున్న వారికి అవకాశం ఇచ్చి ఉన్నత స్థానానికి చేర్చింది. ఈ షో నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోవడానికి నాగబాబు కారణమని జబర్దస్త్ షో మేనేజర్ ఏడుకొండలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. సహ జడ్జ్ రోజా కంటే నాగబాబుకు తక్కువ పారితోషకం ఇవ్వడంతో ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక మల్లెమాల యూనిట్ తో గొడవపడి జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళినట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఇదే విషయంపై.. నాగబాబు – రోజాల మధ్య పారితోషకం విషయంలో ఉన్న తేడాలను కూడా ఏడుకొండలు ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది.  రోజా అప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని, రాజకీయపరంగా  బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఈ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి ఎక్కువ పారితోషకం ఇవ్వాల్సి వచ్చిందని ఏడుకొండలు చెప్పాడు. నాగబాబు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. కాబట్టి ఆయనకు ఇండస్ట్రీలో పెద్దగా డిమాండ్ లేని కారణంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇచ్చే పారితోషకాన్ని నాగబాబుకు ఇచ్చినట్టు ఏడుకొండలు తెలిపారు. ప్రస్తుతం ఏడుకొండలు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. 

No comments:

Post a Comment