రఘురామకృష్ణరాజు ఇంటి ముందు రెక్కీ ?

Telugu Lo Computer
0


భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ వెళ్లలేదు. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వెళ్లాలని తెగ ఉవ్విళ్ళురారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా వచ్చారు. కానీ ఆయనను సీఐడీ పోలీసులు వెంటాడుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఆహ్వానం రాలేదని చివరకు తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఇంతవరకు ఓకే.. కానీ తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణరాజు హైదరాబాద్‌లోని ఇంటివద్ద ఓ వ్యక్తి సంచరించాడు. గుర్తు తెలియని వ్యక్తి పోటోలు తీసినట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసును అంటూ ఆ వ్యక్తి చెప్పడం కలకలం రేపుతోంది. ఐడీ కార్డు చూపమంటే.. సిబ్బందితో ఆ వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. కాగా తన హత్యకు కుట్రపన్నారని రఘురామ ఆరోపించారు. అందుకే రెక్కీ నిర్వహించారని మండిపడ్డారు. రఘురామ కృష్ణరాజు ఇంటి ముందు అపరిచిత వ్యక్తులు గత మూడు రోజులుగా రెక్కీ నిర్వహించారట. రఘురామ సెక్యూరిటీ సబ్బంది గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకడు దొరికాడు. మిగిలినవారు పారిపోయారు. ఆ వ్యక్తిని విచారించగా పలు రకాలుగా సమాధానం చెబుతున్నాడు. తన పేరు బాషా అని, మరొసారి సుభాన్ అని చెబుతున్నాడు. డిపార్టుమెంట్‌కు చెందిన వ్యక్తినని, విజయవాడ, హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తూ ఉంటానని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చినట్లు ఆ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. ఏఆర్ కానిస్టేబుల్‌నని, క్రైమ్ పోలీసునని చెబుతున్నాడు. వీఆర్‌లో ఉన్న తనను ఉన్నతాధికారులే ఇక్కడకు తీసుకు వచ్చారని తెలిపాడు. పోలీస్ ఐడీ కార్డ్ చూపించాలని అడగ్గా.. గుర్తింపు కార్డు లేదన్నాడు. తనతో పాటు వచ్చిన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని అడిగారు. ఆ వ్యక్తి నోరు విప్పక పోవడంతో.. రఘురామ సెక్యూరిటీ సిబ్బంది అతని వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)