హీరో విక్రమ్‌కు హార్ట్‌ఎటాక్ !

Telugu Lo Computer
0


ప్రముఖ తమిళ హీరో చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చింది. ఈరోజు ఉదయం ఆయనకు గుండె పోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్-1 సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం చెన్నైలో రిలీజ్ కానుంది. ఆ కార్యకమానికి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్-1 పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. సెప్టెంబర్ 3న దక్షిణాదిభాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)