ఆల్‌టైం గరిష్టానికి పడిపోయిన రూపాయి మారకం !

Telugu Lo Computer
0


డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. ఇటీవల 79.23 దగ్గర నిలిచిన రూపాయి విలువ  మరింత పడిపోయి 79.88 వద్ద స్థిరపడింది. దీంతో చరిత్రలో ఆల్‌టైం గరిష్టానికి చేరినట్టయింది. అలాగే 80 చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పతనాన్ని ఆపడానికి ఆర్బీఐ ఇటీవల రెండు సార్లు రెపో రేటు పెంచినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ పరిణామాలు రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు మరింత బలపడుతోంది. గురువారం 0.56 శాతం మేర డాలరు లాభపడింది. డాలరు విలువ పెరగడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లు పెంచడంతో దేశీయ ఈక్వెటీ మార్కట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. అటు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం రావొచ్చన్న అంచనాలతో క్రూడాయిల్ ధర పడిపోతోంది. దీంతో కొద్ది రోజుల్లో రూపాయి నష్టపోవడం ఆగుతుందనే అంచనాను ఫారెక్స్ డీలర్లు వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)