ఆరు లక్షల ఆధార్ కార్డుల రద్దు !

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల ఆధార్ కార్డు నెంబర్లు రద్దు అయ్యాయి. వీటిని రద్దు చేసిన యూఐడిఏఐ సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. రద్దు చేసిన ఆధార్ నెంబర్లన్నీ నకిలీవని ఆధార్ కార్డ్ జారీ అథారిటీ తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులతో దుండగులు పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ఆధార్ నంబర్లను రద్దు చేసినట్లు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయడం యూఐడిఏఐ బాధ్యత అని పేర్కొన్నారు. నకిలీ ఆధార్ కార్డులను నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నకిలీ ఆధార్ వినియోగాన్ని అరికట్టడానికి ఫేస్ అథెంటికేషన్ వంటి కొత్త ఫీచర్లు కూడా తీసుకురావడం జరిగిందన్నారు. దీని వల్లే 5,98,999 నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి, వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)