కల్తీ మధ్యానికి 25 మంది బలి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని బొతాద్ జిల్లాలో స్థానికులు కొందరు ఆదివారం కల్తీ మద్యం సేవించారు. సోమవారం ఉదయంకల్లా వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు వీరిని దగ్గర్లోని భావ్‌నగర్, బొతాద్, బర్వాలా పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. ఇలా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో, వేర్వేరు పట్టణాల్లో స్థానికులు ఆస్పత్రి పాలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ ఒకే తరహా మద్యం సేవించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసుల అంచనా ప్రకారం.. ఈ మద్యాన్ని స్థానికంగా ఒక వ్యాపారి అక్రమంగా తయారు చేసి అమ్ముతున్నాడు. బాధితులు సేవించిన మద్యంలో మిథైల్ శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మద్యం సేవించిన వారిలో ఇప్పటివరకు దాదాపు 25 మంది మరణించినట్లు సమాచారం. మరో 40 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం తయారీదారులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)