బెంగాల్‌పై కన్నేస్తే బెంగాల్‌ టైగర్లున్నాయ్ జాగ్రత్త ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 26 July 2022

బెంగాల్‌పై కన్నేస్తే బెంగాల్‌ టైగర్లున్నాయ్ జాగ్రత్త !


మీరు ఇక్కడ (పశ్చిమ బెంగాల్)కు రావాలంటే… బంగాళాఖాతం దాటి రావాలి. మీరు ఇక్కడకు వచ్చేలోపే మొసళ్లు కొరుక్కుతినేస్తాయ్.. సుందరబన్స్‌లోని రాయల్‌ బెంగాల్‌ టైగర్లు, ఏనుగులు మీపై దాడి చేస్తాయ్‌ జాగ్రత్త అంటూ బీజేపీపై మమతాతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్థ ఛటర్జీ అడ్మిట్‌ అయిన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రి దేశంలోనే నెంబర్‌ వన్‌ హస్పటల్‌ అయినప్పటికీ ఎందుకు అభ్యంతరం చెప్పారు? అంటూ ప్రశ్నించారు. పైగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్పత్రి (భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌)కే ఆయన్ను ఎందుకు తరలించారు?. అసలు మీ ఉద్దేశం ఏంటీ? అంటూ నిలదీశారు. ఇది ముమ్మాటికీ బెంగాల్‌ ప్రజలను అవమానపరచటేమే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం అమాయకమైనదీ, మరి రాష్ట్రాలన్నీ దొంగలా? అంటూ బీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రాల వల్లే మీరు అక్కడ ఉన్నారు అంటూ మమతా బెనర్జీ బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ పై ఫోకస్ పెడుతున్న క్రమంలో దీదీ ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా కనబడుతోంది.

No comments:

Post a Comment