యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 30 July 2022

యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు !


కేరళ రాజధాని తిరువనంతపురంలో యూట్యూబ్‌లో చూసి మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు పన్నెండేళ్ళ బాలుడు. గ్రేప్ వైన్ తయారు చేసి తన స్నేహితుడికి ఇచ్చాడు. దీంతో ఈ మద్యం తాగిన అతడి స్నేహితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. మద్యాన్ని తయారు చేసిన బాలుడిని తాము విచారించామని చెప్పారు. తన తల్లిదండ్రులు తీసుకొచ్చిన దాక్షతో తాను యూట్యూబ్‌లో చూసి వైన్ తయారు చేశానని ఆ బాలుడు తమకు  తెలిపాడని అన్నారు. మద్యాన్ని తయారు చేశాక దాన్ని ఓ బాటిల్‌లో పోసి, భూమిలో పాతిపెట్టానని ఆ బాలుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇలాగే చేయాలని యూట్యూల్‌లో చూసి నేర్చుకున్నానని ఆ బాలుడు వివరించాడని అన్నారు. ఆ తర్వాత దాన్ని ఆ బాలుడు స్నేహితుడికి ఇచ్చాడు. దాన్ని తాగిన అతడి స్నేహితుడు వాంతులు చేసుకుని, అనారోగ్యానికి గురయ్యాడు. న్యాయస్థానం అనుమతితో పోలీసులు ఆ మద్యం శాంపిళ్ళను బాటిల్ నుంచి తీసుకుని పరీక్షకు పంపారు. దీనిపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment