స్పెయిన్ లో తొలి మంకీపాక్స్ మరణం

Telugu Lo Computer
0


స్పెయిన్ దేశంలో తొలి మంకీపాక్స్ మరణం సంభవించింది. యూరప్ ఖండంలో ఇదే మొదటి మరణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం యూరప్ లో మంకీపాక్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం స్పెయిన్ లో 3750 మంది మంకీపాక్స్ బాధితుల్లో 120 మంది చికిత్స పొందుతుండగా.. ఒకరు మరణించారు. ఆఫ్రికా ఖండం వెలువల సంభవించిన రెండో మరణంగా దీన్ని చెప్పవచ్చు. అంతకుముందు బ్రెజిల్ లో మంకీపాక్స్ తో ఓ వ్యక్తి మరణించాడు. యూరప్ లో బెల్జియం, స్పెయిన్ లో జరిగిన రెండు రేవ్ పార్టీలే వివిధ దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించడానికి కారణం అని అంతా భావిస్తున్నారు. ఆ పార్టీ తరువాత నుంచే యూరోపియన్ దేశాల్లో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇదిలా ఉంటే యూరప్ దేశాలతో పాటు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురిలో మంకీపాక్స్ వైరస్ వెలుగులోకి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)