30 కోట్ల పైగా కుచ్చుటోపీ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 30 July 2022

30 కోట్ల పైగా కుచ్చుటోపీ !


తెలంగాణలోని హన్మకొండ టీచర్స్‌ కాలనీ కి చెందిన ప్రమోద్‌ కుమార్‌రెడ్డి. గంగాసాని సునీత ఇద్దరూ భార్యభర్తలు. టీచర్స్‌ కాలనీలో గత 15సంవత్సరాలుగా కాపురం ఉంటున్నారు. ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఏటూరు నాగారంలోని ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అతని భార్య సునీత వెంచర్లు వేస్తున్నామని, ముందుగానే డబ్బులు చెల్లించి బుక్ చేసుకుంటే తక్కువ ధరకే వస్తుందని చుట్టు పక్కల ఉంటున్న వాళ్లతో పాటు బంధువులు, తోటి ఉద్యోగస్తులను నమ్మించారు. ప్రమోద్‌కుమార్‌రెడ్డికి ప్రభుత్వం ఉండటంతో అందరూ దంపతులు చెప్పిన మాటలు నమ్మారు. కాలనీ వాసులతో పాటు పరిచయస్తులు,స్నేహితులు, బంధువులు మొత్తం 30మందికిపైగా ఒకరికి తెలియకుండా మరొకరు సుమారు 30 కోట్ల రూపాయలకుపైగా ముట్టజెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ప్రమోద్‌కుమార్, సునీత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించకుండా నెట్టుకొస్తున్నారు. డబ్బులు కట్టిన వాళ్లు గట్టిగా నిలదీశారు. వెంచర్‌లో ప్లాట్లు చేయలేదని మ్యానేజ్ చేశారు. ఆ తర్వాత జనగామ జిల్లా రఘునాధపల్లిలో కొమ్మళ్ల దగ్గర వెంచర్ వేస్తున్నామని చెప్పారు. టాపిక్‌ డైవర్ట్ చేశారు. ప్లాట్లు బుక్ చేసుకున్న వాళ్లంతా రిజిస్ట్రేషన్ చేయమని పట్టుబట్టడంతో ఉద్యోగానికి లాంగ్‌ లీవ్ పెట్టుకొని ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే మాయమైపోయారు. ఒకరిద్దరు కాదు మొత్తం ముప్పై మందికిపైగా బాధితులు ఉన్నారు. కోటి రెండు కోట్లు కాదు 30కోట్ల రూపాయల వరకు వాళ్లకు కట్టారు. ఇంత పెద్ద మొత్తంలో మోసం చేశారని తెలిసి డబ్బులు కట్టిన బాధితులు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల వెర్షన్ ఇలా ఉంటే ప్రమోద్‌కుమార్‌ సోదరుడు లండన్‌లో ఉంటున్నారు. అతను మొదట్లో ఫోన్ చేసి తాను సెటిల్ చేస్తానని చెప్పి వచ్చి..తన భూములు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకొని లండన్ వెళ్లాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టించుకొని విదేశాలకు వెళ్లి తలదాచుకున్న ప్రమోద్‌కుమార్‌ దంపతులను పట్టుకొచ్చి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కాలనీలో ఉంటున్నారని నమ్మితే ఇంతటి మోసం చేస్తారనుకోలేదని వాపోతున్నారు. ప్రమోద్‌కుమార్‌ దంపతులు ఎవరికి చెప్పవద్దని డబ్బులు చెల్లిస్తామని చెప్పడం వల్లే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని ..కాని ఇప్పుడు తమకు ఆర్ధికంగా ఇబ్బంది కావడంతో కంప్లైంట్ ఇచ్చామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

No comments:

Post a Comment