దేశంలో కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో 24 గంటల్లో కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని, రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతంగా నమోదైందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,50,434గా ఉందని పేర్కొంది. కరోనా వల్ల దేశంలో నిన్న 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 5,25,870కి చేరిందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 5,07,360 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని వివరించింది. ఇప్పటివరకు 87.11 కోట్ల పరీక్షలు చేశారని పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 29,12,855 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని తెలిపింది. కాగా, కరోనా కేసులు మళ్ళీ పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు మాస్కులు వాడడాన్ని తప్పనిసరి చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)