దేశంలో 14,830 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 14,830 కొత్త కేసులు నమోదయ్యాయి. 36 మంది మరణించారు. అంతకుముందు రోజు 16,866 కేసులు నమోదుకాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,512కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.34. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 43,920,451. కరోనాతో మరణించిన సంఖ్య 5,26,110. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,32,46,829. పాజిటివిటీ రేటు 3.48 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.53 శాతం కాగా, కోవిడ్ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 202.5 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 30,42,476 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం బూస్టర్ డోసు కూడా ఉచితంగా అందిస్తోంది. దేశంలో ఇప్పటివరకు దాదాపు 87 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)