మజ్జిగ, పెరుగు, లస్సీపై కూడా జీఎస్టీ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళ, బుధవారాల్లో 47వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అనేక ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెస్తూ, మరికొన్నింటి శ్లాబ్స్ మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ జీఎస్టీ రేట్లు జూలై 18 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త జీఎస్టీ రేట్ల వల్ల విద్యార్థులు, గృహిణులు, రైతులు, పర్యాటకులపై మరింత భారం పడనుంది. పెన్సిల్స్, ప్రింటింగ్ ఇంక్స్, ఎల్ఈడీ ల్యాంప్స్ వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.  ప్రీ ప్యాక్డ్ పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ, బ్యాంకులు జారీ చేసే చెక్కు బుక్కులపై 18 శాతం, కత్తులు, కటింగ్ బ్లేడ్లు, ఎల్ఈడీ లైట్లు, ఫిక్సర్, టెట్రా ప్యాక్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, పెన్సిల్ చెక్కుకునే షార్పెనర్స్‌పై 18 శాతం, సోలార్ వాటర్ హీటర్, సిస్టంపై 12 శాతం, చెప్పులు, తోలు పరిశ్రమల ఉత్పత్తుల తయారీ జాబ్‌వర్క్‌పై 12 శాతం, రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశాన వాటికల కాంట్రాక్టు వర్కులపై 18 శాతం, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలపై 1.5 శాతం, మ్యాపులు, చార్టులు, అట్లాస్‌లపై 12 శాతం, ఆర్థోపెడిక్ ఎక్విప్‌మెంట్‌పై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ప్యాక్ చేయని, లేబుల్స్ లేని వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)