తప్పుడు కేసులపై ప్రైవేట్ కేసులు వేస్తాం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 10 June 2022

తప్పుడు కేసులపై ప్రైవేట్ కేసులు వేస్తాం !


తమ బాధలను చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కి పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని.. చాలాచోట్ల కొందరు హత్యలకు గురయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ హయాంలో 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారన్నారు. 4 వేల మంది టీడీపీ వారిపై కేసులు పెట్టారు. మంత్రులుగా చేసిన వారిని నలుగురిని, ఆరుగురు కీలక నేతలను అరెస్టులు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 మంది పార్టీ నేతలను కేసులతో వేధించే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ పాలనలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై హత్యాకాండ సాగించారని చంద్రబాబు ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. బడుగు వర్గాలకు చెందిన వారే వైసీపీ ప్రభుత్వం వల్ల 291 మంది చనిపోయారని.. వీళ్లా సామాజిక న్యాయం గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. ఇలా ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందర్ని ఇబ్బందులు పెట్టారని.. హత్యాకాండ సాగించారన్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాల వల్లే చాలా మంది ప్రాణాలు కొల్పోయిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని భయపడకుండా కట్టడి చేయాలని.. లేకుంటే భయమే ప్రజల్ని చంపేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో లేదన్నారు. కొత్త డీజీపీ వచ్చాక ఏపీలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని చంద్రబాబు విమర్శించారు. ఏపీని నేరస్థుడు పరిపాలిస్తున్నారు కాబట్టి పోలీసులు నేరస్తులకు వంతపాడుతున్నారా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరు మారకుంటే.. తామే మారుస్తాం.  ఏ విధంగా చేయాలో తమకు తెలుసన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల పదో తరగతి విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలను.. ప్రభుత్వం చేతకాని తనం వల్ల చంపేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసేది సామాజిక న్యాయం కాదని.. సామాజిక హత్యలు అని ఆరోపించారు. పోలీసుల తీరును ఇక ఊపేక్షించమన్నారు. నిబంధనలను ఉల్లంఘించే పోలీసులపై పోరాడతామని తెలిపారు. సీబీసీఐడీ అంటే 41-ఏ నోటీసులివ్వడానికే ఉందా అని నిలదీశారు. సీబీసీఐడీ వేధింపుల డిపార్టమెంటుగా తయారైందన్నారు. సీబీసీఐడీ పోలీసులకు, టెర్రరిస్టులకు తేడా ఉందా అన్నారు. మఫ్టీలో వచ్చే వాళ్లు సీఐడీ పోలీసులో, వైసీపీ కార్యకర్తలో తెలియడం లేదన్నారు. ఇదే పోలీసులు గతంలో టెర్రరిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశారని.. ఇప్పుడు నేరస్తులకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఇష్ట ప్రకారంగా పోలీసులు వ్యవహరిస్తే వదిలిపెట్టనని హెచ్చరించారు. పోలీసులను డిక్టేట్ చేసేది డీజీపీ కాదని.. సజ్జల లాంటి గుమాస్తాలేనని చురకలు అంటించారు. అందుకే డీజీపీలు మారినా పోలీసుల తీరు మారడం లేదన్నారు. పోలీసులపై పెట్టే ప్రతి తప్పుడు కేసుపైనా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు కేసులపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు భరోసా ఇస్తూ మీటింగ్ పెడితే దొంగల్లా దూరారని.. దాన్ని ఏ2 సమర్థించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరని.. వస్తానంటే రమ్మనండి.. చూద్దామన్నారు. నేరస్తులకు నేరాలోచనలే వస్తాయన్నారు. ఎన్నిసార్లు వస్తారో రమ్మనండి చూద్దాం.. ఖబడ్దార్ అన్నారు. ఏపీలో టీచర్లని మద్యం దుకాణాల వద్ద పెట్టినప్పుడే మానసికంగా టీచర్లు చనిపోయారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీచర్ల గౌరవాన్ని తగ్గించారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేయాలనుకుంటారా అని నిలదీశారు. మంత్రి భార్య కాపురం చేయకున్నా తమదే బాధ్యతా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నాశనం చేశారు కాబట్టే క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. రైతులే కాదు.. ఆక్వా, హర్టీకల్చర్ రైతులు కూడా హాలిడే ప్రకటించనున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ రాష్ట్రానికి పట్టిన ఓ దరిద్రం అని.. రాష్ట్రానికి పట్టిన అరిష్టమని మండిపడ్డారు. జగన్‌ది ఐరన్ లెగ్ అన్నారు. వ్యవస్థలను ధ్వంసం చేశారు కాబట్టే రాష్ట్రానికి అరిష్టం పట్టిందన్నారు.

No comments:

Post a Comment