భవిష్యత్తు ఘర్షణలకు చైనా పునాది వేస్తుంది..!

Telugu Lo Computer
0


'భవిష్యత్తులో ఘర్షణాత్మక చర్యకు దిగేందుకు చైనా పునాదులు నిర్మిస్తోంది. ఈ చర్యలను విస్మరించడం ద్వారా ప్రభుత్వం భారతదేశానికి ద్రోహం చేస్తోంది' అని రాహుల్ ఆ కథనాన్ని షేర్ చేశారు. సరిహద్దు వెంట చైనా అభివృద్ధి చేస్తోన్న సైనిక వసతులపై అమెరికా అగ్రశ్రేణి జనరల్‌ ఛార్లెస్‌ ఎ.ఫ్లిన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు దారితీశాయి. 'భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా సైనిక కార్యాచరణ స్థాయి కళ్లు తెరిపించేలా ఉంది. వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో నిర్మిస్తున్న కొన్ని మౌలిక సదుపాయాలు ప్రమాదకరంగా ఉన్నాయి. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఆ నిర్మాణాలు ఎందుకు అవసరమవుతున్నాయో, వారి అసలు ఉద్దేశం ఏమిటో సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఉంది' అని అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ ఫ్లిన్ బుధవారం దిల్లీలో వ్యాఖ్యానించారు. తూర్పు లద్ధాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతను ఫ్లిన్‌ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియన్ తిప్పికొట్టారు. 'ఈ సరిహద్దు సమస్య చైనా, భారత్‌ల మధ్య ఉంది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఇరుపక్షాలకు ఉంది. ఈ విషయంలో కొంతమంది అమెరికా అధికారులు అగ్నికి ఆజ్యం పోసేందుకు యత్నిస్తున్నారు. మా వైపు వేలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. బదులుగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి దోహదపడేందుకు వారు మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం' అని మండిపడ్డారు. తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులు స్థిరత్వం దిశగా సాగుతున్నాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)