అక్రమ సంబంధం పెట్టుకున్నారని వివస్త్రలను చేసి ఊరేగించారు !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌ లోని కొండగావ్ జిల్లా ఉరిందబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఓ వివాహిత మరో వివాహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే  నెపంతో గ్రామస్థులు వారిద్దరిని పట్టుకొని బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసు బృందాన్ని గ్రామానికి పంపి విచారణ చేపట్టారు. తన భర్త మరో వివాహితతో ఉండగా గుర్తించిన భార్య ఆమె బంధువులతో సహా కొంతమందికి ఫోన్ చేసి పిలిచిందని పోలీసు అధికారి తెలిపారు. ఆ బృందం వారిద్దరినీ పట్టుకొని వారి బట్టలు విప్పి స్థానికంగా ఊరేగించారని పోలీసులు చెప్పారు. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఉరిందబెడ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354,ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి భార్యతో సహా నలుగురిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)