లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Telugu Lo Computer
0


స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాల మధ్య మార్కెట్లలో ఉపశమన ర్యాలీ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఈ ర్యాలీకి కారణమయ్యాయి. మరోవైపు 10 ఏళ్ల బాండ్ల రాబడులు రెండువారాల కనిష్ఠానికి చేరడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం సూచీలకు కలిసొస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.16 వద్ద కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 398 పాయింట్ల లాభంతో 52663 వద్ద, నిఫ్టీ 1128 పాయింట్లు లాభపడి 15685 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే నష్టాల్లో చలిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)