అసోం నుంచి ముంబై బయలుదేరిన రెబల్ ఎమ్మెల్యేలు

Telugu Lo Computer
0


తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ముంబైకి పయనమయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే బీజేపీ కి మద్దతివ్వబోతున్నారని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచాయి. ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాగా శివసేన ఎల్‌పీఎల్ నేతగా అజయ్ చౌదరికి ఆమోదం తెలిపిన మహారాష్ట్ర స్పీకర్ నర్హరి జరివాల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు బొంబే హైకోర్ట్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని తిరుగుబాటు సూత్రదారి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇందులో 40 మంది శివసేన ఎమ్మెల్యేలని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు తమకు 2/3 వంతు మెజారిటీ ఉందన్నారు. కాగా షిండే శిబిరంలోకి మరికొంతమంది సేన ఎమ్మెల్యేలు చెరే అవకాశాలున్నాయని రిపోర్టులు వెలువడుతున్నాయి. శివసేన సీనియర్ నేత, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వాస పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం బలం నిరూపించుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెబల్ నేతలు ముంబై రావాలని డిమాండ్ చేశారు. అవసరమైన పార్టీ శ్రేణులు వీధుల్లోకి వస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ యుద్ధం చట్టపరమైన, శాసనపరమైనదిగా మారిపోయిందన్నారు. ఏక్‌నాథ్ షిండేని బీజేపీ నియంత్రిస్తోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)