అన్నాడీఎంకేలో సంక్షోభం తీవ్రం

Telugu Lo Computer
0


అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభం మరింత తీవ్రమైంది. ఏక నాయకత్వం అనే అంశంపై ఓ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె పన్నీర్ సెల్వం మధ్య చిచ్చు రేగిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ల సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. అన్నాడీఎంకే అఫీస్ బేరర్ల సమావేశానికి ముఖ్యమంత్రి ఈపీఎస్, పార్టీ నేతలు హాజరు కాగా, పార్టీ కార్యాలయం లోపల ఏర్పాటు చేసిన బోర్డుపై ఉన్న ఓపీఎస్ ఫోటోను కొందరు తొలగించారు. ఇదే తరహా ఘటన పొరుగున ఉన్న పాండిచ్చేరిలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కూడా చోటుచేసుకుంది. అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తొలగిస్తారనే ఊహాగానాల మధ్య ఆఫీస్ బేరర్ల సమావేశం జరగడంతో ఉత్కంఠ నెలకొంది. దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ, చాలా నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోవచ్చుననీ, అయితే జూలై 11న ఏర్పాటు చేసే జనరల్ కౌన్సిల్ సమావేశంలో మాత్రమే వాటిని వెల్లడించడం జరుగుతుందని చెప్పారు. ''వంచనకు మారుపేరు ఓపీఎస్'' అని ఆయన విమర్శించారు. పార్టీ పత్రిక ''నముదు అమ్మ'' నుంచి ఓపీఎస్ పేరును తొలగించడంపై మాట్లాడుతూ, ఇంకెంతమాత్రం ఆయన పేరు కొనసాగించడం ఉండదని చెప్పారు. అన్నాడీఎంకే ఆఫీస్ బేరర్ల సమావేశంపై జయకుమార్ మాట్లాడుతూ...''ప్రస్తుత డిప్యూటీ, జాయింట్ కోఆర్డినేటర్ల పదవీకాలం ముగిసింది. ప్రధాన కార్యాలయ ఫంక్షనరీల విజ్ఞప్తి మేరకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ తమిళమగన్ హుస్సేన్ సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేశాం. మొత్తం 74 మంది హెడ్‌క్వార్టర్స్ సభ్యుల్లో 65 మంది ఇవాళ హాజరయ్యారు. సభ్యులతో చర్చ అనంతరం సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)