మనవడితో కలిసి 'జిగేల్ జిగేల్' పాటపై అదిరిపోయే స్టెప్పులేసిన బామ్మ

Telugu Lo Computer
0


మనువడితో కలిసి ‘జిగిల్ జిగిల్’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపిస్తోంది ఓ బామ్మ. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ‘అక్షయ్ పార్థ’ అనే యూజర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అక్షయ్ తన బామ్మతో కలిసి రెగ్యులర్‌గా రీల్స్ చేస్తుంటాడు. ప్రస్తుతం ‘మై మనీ డోంట్ జిగిల్ జిగిల్’ అనే పాట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట వైరల్ చాలెంజ్‌లో భాగంగా అక్షయ్ తన బామ్మతో కలిసి ఈ పాటపై రీల్ చేశాడు. అక్షయ్ బామ్మ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నది. నీలిరంగు చీర ధరించిన బామ్మ తన మనువడితో కలిసి నవ్వులు చిందిస్తూ నృత్యం చేసింది. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 3.5లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ వయస్సులోనూ అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన బామ్మను నెటిజన్లు మెచ్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)