ఉపాధ్యాయినీలకు షోకాజ్ నోటీసులిచ్చిన సమగ్రశిక్ష అభియాన్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది 6 లక్షల మంది పైచిలుకు పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 4 లక్షల మందే పాస్‌ అయ్యారు. మిగితా 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌ సంబంధిత ఉపాధ్యాయినీలకు నోటీసులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయినందుకు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయినీలకు సమగ్రశిక్ష అభియాన్ షోకాజ్ నోటీసులు జారీచేసింది. కొందరు విద్యార్థులు కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించలేక పోయారని, ఇది తమ శాఖపై చెడు ప్రభావం చూపిందని ఆయా సబ్జెక్టుల టీచర్లకు పంపిన తాఖీదుల్లో పేర్కొంది. ఈ నోటీసుకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది విద్యాశాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)