ఢిల్లీ గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీ, కరోల్ బాగ్ లోని గఫార్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. 39 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం లోపల ఎవరూ చిక్కుకోలేదు. ఇప్పటి వరకు ఎటువంటి గాయాలు సంభవించలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)