30 మంది జవాన్లపై హత్యా నేరం !

Telugu Lo Computer
0


సామాన్య పౌరుల మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ 30 మంది సైనికులపై నాగాలాండ్‌ పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. గతేడాది డిసెంబర్‌ 4న మోన్‌ జిల్లాలోని ఒటింగ్‌-టురు ప్రాంతంలో 21 పారా స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో జవాన్లపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక విచారణ బృంధాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేపట్టిన సిట్‌ జవాన్లు గస్తీ సమయంలో నిబంధనలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపినట్లు తేల్చింది. దీంతో ఈ ఘటనకు 30 మందిని బాధ్యులుగా తేల్చిన సిట్‌.. వారి పేర్లతో రూపొందించిన చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. వారిలో ఒక మేజర్‌, 29 మంది సైనికుల ఉన్నారని డీజీపీ లాంగ్‌కుమేర్‌ తెలిపారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదుచేసినట్లు చెప్పారు. గత డిసెంబర్‌ 4న సాయంత్రం బొగ్గు గనుల్లో పనులు ముగించుకున్న ఎనిమిది మంది కూలీలు బొలేరో వాహనంలో వెళ్తున్నారు. వారిని నాగా తీవ్రవాదులుగా భావించిన జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఘర్షణ నెలకొంది. దీంతో సైనికులు కాల్పుల్లో మరో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)