దేశంలో 8,084 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో నిన్న 8,084 కొత్త కేసులు నమోదుకాగా,  పది మంది మరణించారు. గడిచిన వారంలో దాదాపు 49,000 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారం ఈ సంఖ్య 25,596గా ఉంది. వారంలోనే దాదాపు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం 17,380 కేసులు నమోదుకాగా, కేరళళో 14,500 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 4,068 కేసులు, కర్ణాటకలో 2,975, తమిళనాడులో 1,299, తెలంగాణలో 851, ఆంధ్ర ప్రదేశ్‌లో 117 కేసులు నమోదయ్యాయి. గత సోమవారం అత్యధికంగా 8,084 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు పరీక్షలు నిర్వహించగా ఢిల్లీలో 735 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో కేసుల సంఖ్య 600 దాటడం ఇది వరుసగా మూడోరోజు. గడిచిన 24 గంటల్లో తెలంగాణో 129 కొత్త కేసులు నమోదుకాగా, అందులో జీహెచ్ఎమ్‌సీ పరిధిలోనే 104 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఢిల్లీ, తెలంగాణలో కరోనాతో ఎటువంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణో పాజిటివిటీ రేటు 1.1 శాతంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)