విశాఖ ఉక్కు ఉద్యమానికి నేటికి 500 రోజులు !

Telugu Lo Computer
0


విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని అమ్మివేయడానికి పాలకుల యత్నాలకు నిరసనగా విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడి నేటికి 500రోజులకు చేరుకుంది. ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో అడ్డంకులు ఇవేవీ కార్మిక, ఉద్యోగుల ఉక్కు సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. పైగా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమ ప్రణాళికలు మరింత రాటుతేలాయి. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా నేడు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తోంది జేఏసీ. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఢిల్లీలో లావాదేవీల సలహా కమిటీ, న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఉక్కు పరిశ్రమని కాపాడేందుకు కోటి సంతకాల ప్రచారం, పాదయాత్రలు, ర్యాలీలు, రాష్ట్రవ్యాప్త బంద్‌లు, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, రాస్తారోకోలు చేపట్టి తమ నిరసన తెలిపాయి. వీరి ఆందోళనలకు అధికార వైసీపీ కూడా మద్దతు తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడు కోవడానికి కార్మిక శక్తి పిడికిలిబిగిం చి 500రోజులైంది. ప్రయివేటీకర ణను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన పోరాటం నిరవధికంగా కొనసాగు తోంది. కార్మికులు,ఉద్యోగుల పోరా టాలకు ప్రజలు,రాజకీయ పక్షాల సంపూర్ణ మద్దతు లభించడంతో పొరుబాటులో ఉంటూనే ఫ్యాక్టరీ ని లాభాల పట్టించారు కార్మికులు. 500రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తోంది. కూర్మన్నపాలెంలో ని స్టీల్ ప్లాంట్ ఆర్చి దగ్గర నుంచి వందల మంది కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. వీరికి నిర్వాసితులు కలిసి రావడంతో ఈ ర్యాలీ ద్వారా కేంద్రం దృష్టికి తమ డిమాండ్ ను బలంగా తీసుకెళ్లాలనేది ప్రయత్నంగా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి సిటీలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం జంక్షన్ వరకు సుమారు 20కి.మీ బైక్ ర్యాలీ జరుగుతుంది. అక్కడి నుంచి రాజకీయ పక్షాలతో కలిసి భారీ పాదయాత్ర చేపట్టనున్నారు కార్మికులు. జీవీఎంసీ దగ్గర నిర్వహించే బహిరంగ సభ ద్వారా తమ గళం మరింత గట్టిగా ఢిల్లీకి వినిపించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలనేది ప్రయత్నం.స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రదర్శనతో సిటీలో ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు పోలీసులు.

Post a Comment

0Comments

Post a Comment (0)