జర్మనీలో మోడీకి ఘన స్వాగతం

Telugu Lo Computer
0


శనివారం రాత్రి జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆది, సోమవారాల్లో జరగనున్న జీ7 సమ్మిట్ లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సులో ఎన్విరాన్ మెంట్, ఎనర్జీ, క్లైమేట్, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్, కౌంటర్ టెర్రరిజం, జెండర్ ఈక్వాలిటీ, ప్రజాస్వామ్యం అంశాలపై చర్చించనున్నట్లు మోడీ తెలిపారు. జీ7 దేశాధినేతలతో పాటు సదస్సులో పాల్గొంటున్న ఇతర దేశాల లీడర్లతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ టూర్ లో భాగంగా యూరప్ లో ఉంటున్న మనోళ్లతోనూ సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈసారి జీ7 సమ్మిట్ జర్మనీ ఆధ్వర్యంలో జరుగుతోంది. సదస్సుకు మన దేశంతో పాటు అర్జెంటీనా, ఇండోనేషియా,  సెనెగల్, దక్షిణాఫ్రికాను కూడా ఆహ్వానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)