ప్రధాని మోదీ జూలై 4న భీమవరం పర్యటన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 June 2022

ప్రధాని మోదీ జూలై 4న భీమవరం పర్యటన


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జూలై 4న ప్రధాని మోడీ భీమవరంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పా ప్రధానట్లు చేయాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనకు నెలరోజులు సమయం ఉన్నందును ఇప్పుడే అవసరమైన ప్రణాళిక రూపోందించుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. వీడియో లింక్‌ ద్వారా ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యనార్, సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయ కుమార్‌రెడ్డి, స్వచ్చాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఈ వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment