దేశంలో కొత్తగా 15,940 కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24గంటల్లో కోవిడ్ కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. శుక్రవారం 17,336 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, గడిచిన 24 గంటల్లో 3,63,103 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 15,940 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 91,799గా నమోదైంది. ఇప్పటివరకు 4,33,78,234 కొవిడ్ భారిన పడ్డారు. వీరిలో 5,24,974 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లో కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,425గా ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,27,61,481 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటి రేటు 4.39 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.21 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే భారత్ లో 526 రోజులుగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 196.94 కోట్ల డోసుల టీకాలు వైద్య ఆరోగ్య శాఖ అందజేసింది. గడిచిన 24గంటల్లో 15,73,341 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 196,94,40,932 డోసుల టీకాలు అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)