అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్‌ :10 మంది మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 23 June 2022

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్‌ :10 మంది మృతి


ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్‌లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment