వాదులాటతో వరించిన అదృష్టం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 3 May 2022

వాదులాటతో వరించిన అదృష్టం !


ఆస్ట్రేలియాలోని 'ది లాట్' అనే లాటరీ సంస్థ విడుదల చేసిన టికెట్లలో ఓ గుర్తు తెలియని జంటకు భారీ లాటరీ దక్కింది. అయితే లాటరీ టికెట్‌లను చాలా సార్లు కొంటున్నా, తమకు అదృష్టం లేదని ఆ మహిళ భావించేది. ఇటీవల కూడా ఆమె ఓ టికెట్ అలాగే చూసి, చెత్తబుట్టలో పడేసింది. భర్త సరిగ్గా చూసి పడేయాలని ఆమెకు సూచించాడు. వారిద్దరూ ఆ విషయంపై గొడవ పడ్డారు. చివరికి మాటామాటా పెరిగింది. భార్యను పక్కకు నెట్టి ఆ టికెట్ నంబరును భర్త చూశాడు. నిజంగానే వారికి మన కరెన్సీలో రూ.76 లక్షలు దక్కాయి. ఈ లోపే వారికి లాటరీ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆ సంస్థ ప్రతినిధితో తమ సంతోషాన్ని వారు పంచుకున్నారు. త్వరలోనే లాటరీ సొమ్ముతో మంచి ఇల్లు కొనుక్కుంటానని ఆమె బదులిచ్చినట్లు లాటరీ సంస్థ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె భర్తను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

No comments:

Post a Comment