వీడని కార్ డెత్ మిస్టరీ ?

Telugu Lo Computer
0


విజయవాడ, పటమటలంకలోని డి మార్ట్ సమీపంలో విఎంసీ స్కూల్‌ వద్ద పార్కింగ్‌ చేసిన కారులో లభించిన డెడ్‌ బాడీ మిస్టరీగానే వుంది. AP37 BA 5456 నెంబర్‌ ఉన్న ఇండిగా కారులో మృతదేహం కనిపించింది. కారులో వున్న డెడ్ బాడీ వెనుక కథేంటో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. సీసీ కెమేరాల ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. అయితే, మృతుడు విజయవాడకు చెందిన బాషాగా గుర్తించారు. బాషాది సహజ మరణమా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాషా రెండో భార్య పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది మొదటి భార్య. మార్చురీలోనే అతని మృతదేహం వుంది. దీనికి పంచనామా చేస్తే కానీ మరణానికి గల కారణాలు ఏంటో తెలియవంటున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కారు రోడ్డుపక్కనే నిలిపి ఉంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం రాత్రులు పెట్రోలింగ్ చేసే సిబ్బందికి అయినా అనుమానం వచ్చి ఉండాలంటున్నారు. ఏది ఏమైనా విజయవాడలో ఈ కారు డెడ్ బాడీ వెనుక మిస్టరీ ఏంటో తేలాల్చి వుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)