కేజ్రీవాల్‌ కు బీజేపీ అంటే భయం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 22 May 2022

కేజ్రీవాల్‌ కు బీజేపీ అంటే భయం !

 

గుజరాత్ లోని  సూరత్ లో జరిగిన ఎంఐఎం పార్టీ సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ప్రసంగిస్తూ ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న వేళ కేజ్రీవాల్ ప్రజల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయపడే కేజ్రీవాల్ లాంటి నేతలు ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ ఓవైసీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. బీజేపీకి బీటీమ్ గా తమను కాంగ్రెస్ నేతలు విమర్శించడంపై ఓవైసీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆమోథీలో మజ్లిస్ అభ్యర్థి బరిలో లేరని, అయినప్పటికీ కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని, మిత్రపక్షాలతో కలిసి మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ప్రధాని మోదీ సొంతగడ్డ గుజరాత్ లో కూడా తమ సత్తా చాటడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ద్రవ్వోల్బణం, నిరుద్యోగం లాంటి సమస్యలతో దేశం అల్లాడుతోందని అన్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని, మైనార్టీలు, ఆదివాసీలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. బలమైన ప్రతిపక్షం బాధ్యతల నుంచి కాంగ్రెస్ వైదొలగిందని మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదు లాంటి వివాదపై ప్రధాని మోదీ స్పందించాలని అన్నారు. 1991 చట్టం ప్రకారం నడుచుకోవాలని, జ్ఞానవాపి మసీదు లాంటి వివాదాలు సంఘ్ పరివార్ జాబితాలో చాలా ఉన్నాయన్నారు. పాత గాయాలను తవ్వేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్త సమస్యలు వస్తాయని, ఇది మంచిది కాదని, దేశంలో అశాంతిని నెలకొనే అవకాశాలు ఉంటాయని అసదుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేంద్రం వెంటనే స్పందించాలని, చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని అసదుద్దీన్ కోరారు.

No comments:

Post a Comment