ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు

Telugu Lo Computer
0


విశాఖపట్టణం- సికింద్రాబాద్, విశాఖ- మహబూబ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 1 వతేదీ నుంచి జూన్ 29 వరకు ఈ వారాంతపు రైళ్లను నడపనుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ రైలు జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో రైలు బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 08579/08580.. తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.40కి విశాఖపట్టణం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు ఆంధ్రా, తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో వారాంతపు రైళ్ళు ఆగుతాయి. విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ రైలు ట్రైన్ నెంబర్ 08585/08586 జూన్ నెల 7 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి మంగళవారం విశాఖలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, కాచిగూడ, జడ్చర్ల మీదుగా ప్రయాణించి తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)