ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 17 May 2022

ప్రాణాలు తీసిన ప్లాస్టిక్ సర్జరీ


ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కన్నడ టీవీ నటి చేతన రాజ్ తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరు లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఊపిరితిత్తుల్లోకి ద్రవాలు అధికంగా చేరడంతో చనిపోయారు. నటి తల్లిదండ్రులు మాత్రం  వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైందంటూ ఆరోపిస్తున్నారు. సబ్బు యాడ్‌లలో చేతన రాజ్ చాలా ఫ్యామస్ అయ్యారు. మే 16న, కర్ణాటకలోని బెంగళూరులోని రాజాజీనగర్‌లోని శెట్టి కాస్మొటిక్ సెంటర్‌లో ‘ఫ్రీ ఫ్యాట్’ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. సర్జరీ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులతో పాటు అనస్థీషియా డాక్టర్ మెల్విన్ చేతనను సాయంత్రం 5.30 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి గుండె ఆగిపోయిందనే సమస్యతో ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులను బెదిరించాడు. వైద్యులు సీపీఆర్ ప్రారంభించి 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ చేతనను బ్రతికించలేకపోయారు. ఐసీయూ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సందీప్, బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో చేతన సాయంత్రం మరణించినట్లు ప్రకటించారు.

No comments:

Post a Comment