స్థల వివాదంలో తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 5 May 2022

స్థల వివాదంలో తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం


ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా హిందూపురంలో తల్లీ, కొడుకుల ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరుకు తరలించారు. 1992 లో సర్వేనెంబర్ 310/2లో శకుంతలమ్మ ఇంటి పట్టా తీసుకుంది. అయితే ఇటీవల ఈ స్థలాన్ని స్తానికంగా ఒక నేత తీసుకున్నాడు. కానీ మున్సిపల్ అధికారులు, అలాగే రెవెన్యూఅధికారులు భూముల విషయంపై ఆరా తీస్తుండగా.. ఈ స్థలంలో నకిలీ పట్టా పొందారని తేలింది. దీంతో అధికారులు దీనిపై స్పందిస్తూ ఇది నకిలీ పట్టా అని వివరణ ఇవ్వాల్సిందిగా ఈస్థలంలో ఒక షెడ్డుకు నోటీస్ అంటించారు. దీంతో సదరు శకుంతలమ్మ పై ఒత్తిడి తేవడంతో ఆమె, ఆమె కుమారుడు పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు యత్నించారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఎలాంటి రెఫర్ చేయకపోయినా బాధితుల్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. కానీ శకుంతలమ్మ పొందిన ఇంటి పట్టా దొంగది అంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, చైర్ పర్సన్ ఇంద్రజ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ నవీన్ భార్య జ్యోతి ఆరోపించారు. వైసిపి నాయకుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని నవీన్ భార్య జ్యోతి చెబుతున్నారు. ప్రస్తుతం బాధితులు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.  ఎమ్మెల్సీ ఇక్బాల్ తోపాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజ పేరు తీసుకుని రావడంతో ఇది పొలిటకల్ టర్న్ తీసుకుంది. కానీ ఇక్కడ టీడీపీ కానీ ఇతర పార్టీలు ఏవీ ఈ అంశంలో జోక్యం చేసుకోలేదు. కానీ ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్థానిక తాసిల్దార్ శ్రీనివాసులు స్పందిస్తూ1992 లో సర్వేనెంబర్ 310/2 లోని మున్సిపల్ స్థలంలో నకిలీ పట్టా చూపించి కబ్జాకు పాల్పడ్డారని వివరించారు. ఇంటి స్థలం సంబంధించి వివరాలు అడిగినందుకు అధికారులపైన ప్రజాప్రతినిధులపై ఆరోపించడం సరికాదు అన్నారు. నవీన్, శకుంతలను వేధించాల్సిన అవసరం ఎవరికీ లేదని తెలిపారు. అసలు ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు కూడా లేవని తెలిపారు. మొత్తం మీద తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నం చేయడం దానికి ఎమ్మెల్సీ, మున్సిపల్ ఛైర్మన్ పేర్లు వాడటం రాజకీయంగా కలకలం రేపింది.

No comments:

Post a Comment